
సినిమాలు

తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నటుడు, ఎంపీ కమలహాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు నటుడు విజయ్‌కు గవర్నర్ అవకాశం ఇవ్వాలని కమలహాసన్ డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కమలహాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!