
గాసిప్స్

‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ నమోదు కోసం కల్వకుంట్ల కవిత జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ కింద తన దరఖాస్తును వేగంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఫిబ్రవరి 27న జరిగిన విచారణలో, దరఖాస్తులో పలు లోపాలు ఉన్నాయని మరియు ఫిబ్రవరి 23న కవితకు సమాచారం పంపినట్లు ఈసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదే రోజు కవిత తరఫు సీనియర్ న్యాయవాది ఆసుపత్రిలో ఉండటంతో విచారణను వాయిదా వేయాలని కోరగా, కేసును మార్చి 19కి వాయిదా వేశారు. ఈ పిటిషన్ గురువారం మరోసారి విచారణకు రానుంది.

.jpeg&w=3840&q=75)











.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!