
న్యూస్

కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని స్వయంగా తెలుసుకోడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరే జగన్, పెనమలూరు సెంటర్, ఉయ్యూరు మార్గంగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు. అక్కడ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీస్తారు. అనంతరం అవనిగడ్డ హైవే ద్వారా తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.





.png&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!