

2023 అక్టోబర్‌లో ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గాజాలో తీవ్ర మానవ నష్టానికి దారితీసింది. ఈ సంఘర్షణలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో గాజాలో శాంతి స్థాపన, పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గాజాలో శాంతి, భద్రతల కోసం ఇది ముఖ్యమైన ముందడుగు అని పేర్కొంటూ, నిరాయుధీకరణ ప్రక్రియ దశలవారీగా కొనసాగుతుందని తెలిపారు.
ఈ ఒప్పందం సాధించడంలో సహకరించిన ఈజిప్ట్, ఖతార్, టర్కీ మధ్యవర్తులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే హమాస్ నుంచి ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఆయుధాలను విడిచిపెట్టే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. గాజాలో శాంతి భద్రతల నిర్వహణకు స్థానిక పోలీసులతో పాటు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ (ISF) పనిచేయనుంది. మరోవైపు ప్రాంతంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతుండగా, హమాస్ నిరాయుధీకరణే ఇజ్రాయెల్ ప్రధాన డిమాండ్‌గా ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!