
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ భారీ విజయానికి చేరువలో ఉంది. 110కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో ఆ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో విజయ్ సీఎం పీఠం అధిరోహించడం లాంఛనమే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఇక హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఆమె పుట్టినరోజు రోజున తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం విజయ్ ఇంటికి వెళ్లడం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. విజయ్‌తో కలిసి రాజకీయాల్లోకి త్రిష అడుగుపెడుతుందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో నిర్మాత-నటుడు బండ్ల గణేష్ చేసిన అభినందన ట్వీట్ వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత ఊతం లభించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!