
ఓటీటీ

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం పెంచే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం. మాజీమంత్రి జీవన్‌రెడ్డి పార్టీని వీడిన తరువాత సీనియర్ల అసంతృప్తిని తగ్గించేందుకు నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వి. హనుమంతరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించినట్లు తెలుస్తోంది.
పార్టీలో కొత్తవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరికొందరు సీనియర్ నాయకులకు కూడా పదవులు, నామినేటెడ్ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాత నాయకులను గౌరవించడం ద్వారా పార్టీ కేడర్‌లో నమ్మకం పెంచాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!