
సినిమాలు

భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్ రియాల్టీ షోలోకి అడుగుపెడుతోంది. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్న ‘ద ట్రైటర్స్’ సీజన్-2లో పాల్గొంటోంది. షో ప్రారంభ కార్యక్రమంలో ఆమె చెప్పిన “మై నేమ్ ఈజ్ గిల్... ఐ నో హౌ టు కిల్” అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఆగస్టు 13 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. అంతర్జాతీయంగా విజయవంతమైన ‘ది ట్రైటర్స్’కు ఇది భారతీయ వెర్షన్. ఈ సీజన్‌లో మల్లికా షెరావత్, మునావర్ ఫరూఖి, రియా చక్రవర్తి, క్రిస్టల్ డిసౌజా, పరుల్ గులాటి, దలిప్ తాహిల్ తదితరులు పాల్గొంటుండగా, షహ్నీల్ గిల్ ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!