

భారత్లో మీడియా స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల పరిరక్షణపై నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టిన్ చేసినట్లు వెలువడిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. భారత ప్రజాస్వామ్యం ప్రతి పౌరుడికి భావప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోందని స్పష్టం చేసింది. భారత్ యొక్క గొప్ప సంస్కృతి, వైవిధ్యంపై అవగాహన లేకపోవడమే ఇలాంటి వ్యాఖ్యలకు కారణమని పేర్కొంది.
విదేశాంగ శాఖ కార్యదర్శి సిబీ జార్జ్ మాట్లాడుతూ.. భారత నాగరికతకు 5 వేల ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. హైందవం, బౌద్ధం, జైనం, సిక్కు మతాలు భారతదేశంలో పుట్టి ఇప్పటికీ శాంతియుతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాలు కూడా శతాబ్దాలుగా భారత్లో సుభిక్షంగా కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం సమయానికి 11 శాతంగా ఉన్న మైనారిటీల జనాభా ప్రస్తుతం 20 శాతానికి చేరిందని పేర్కొన్నారు. ఇదే భారత ప్రజాస్వామ్య బలాన్ని చూపుతోందన్నారు. అనంతరం డచ్ ప్రధాని కూడా భారత్, నెదర్లాండ్స్ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న దేశాలని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!