

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఇంకా రెండు రోజులలో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నంలో ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. ఉదయం మొదలుకుని రాత్రివేళ దాకా నాయకులు, కార్యకర్తలు గల్లీగల్లీ తిరుగుతూ ప్రతి ఓటరిని కలుస్తున్నారు. నియోజకవర్గం అంతా సజీవం కావడమే కాకుండా, కాలనీలు, బస్తీల్లో ఆప్యాయతతో ప్రచారం కొనసాగుతోంది. వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన నేతలకు జూబ్లీహిల్స్‌లోని బూత్‌ల వారీగా బాధ్యతలు అప్పగించారు. ప్రతి బూత్‌లో ఓటు శాతం పెరగడమే లక్ష్యంగా వారు గల్లీల్లో తిరుగుతున్నారు. ప్రచారంలో భాగంగా పలువురు నేతలు మైనార్టీలు, యాదవులు, గౌడలు, కమ్మలు వంటి సామాజిక వర్గాల వారిని వ్యక్తిగతంగా కలుసుకుని తమదీ అదే వర్గమని చెబుతూ ఓటు కోరుతున్నారు. ఇళ్లలో ఉన్నవారితో పాటు దుకాణదారులు, ఉద్యోగులు, వ్యాపారులను కూడా పలకరిస్తూ సాన్నిహిత్యం పెంచుతున్నారు.
ఇక ద్వితీయ శ్రేణి నాయకులకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. తమ ప్రాంతంలో మెజార్టీ సాధిస్తే పార్టీలో ప్రాధాన్యం పెరుగుతుందన్న భావనతో వారు రాత్రింబవళ్ళు తిరుగుతున్నారు. ఇటు అధికార కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. “మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చూపిస్తాం” అని ఒకవైపు చెబుతుంటే, “నమ్మకానికి అమ్మలాంటి వారమని” అని మరొకవైపు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. మాటల తూటాలు, సవాళ్లు, హామీలతో జూబ్లీహిల్స్ ఎన్నిక నిజమైన రాజకీయ యుద్ధంగా మారింది.
.webp&w=3840&q=75)










కామెంట్స్ (2)
జూబ్లీహిల్స్ ఇప్పుడు అసలు రాజకీయ రంగస్థలం అయింది!
Election heat rising in Jubilee Hills!