
జనరల్

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు దిశగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ, టీవీకే అధినేత విజయ్‌కు మద్దతు ప్రకటించిన భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాము ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోమని, బయటి నుంచే మద్దతు కొనసాగిస్తామని ఆ పార్టీలు స్పష్టం చేశాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్, భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నాయకులకు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్ భావించినట్లు సమాచారం. అయితే తమకు పదవుల కంటే సిద్ధాంతపరమైన పోరాటమే ముఖ్యమని పేర్కొంటూ లెఫ్ట్ పార్టీలు ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాయి. తమిళనాడులో మతవాద శక్తులకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని కూడా ఆ పార్టీలు వెల్లడించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!