
గాసిప్స్

అసెంబ్లీ ఆవరణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నించారు. ధర్మాన సోదరులకు సంబంధించి పార్టీకి జరుగుతున్న నష్టంపై జగన్తో నేరుగా చర్చించాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఒకసారి జగన్ తనను కలవమని చెప్పారన్న దువ్వాడ, త్వరలోనే ఆయనను కలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే జగన్ అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా ఎన్నికల బరిలోకి దిగుతానని దువ్వాడ స్పష్టం చేశారు. ధర్మాన సోదరుల అంశంపై పార్టీకి కలిగే రాజకీయ నష్టాన్ని అధినేతకు వివరించాలని భావిస్తున్నానన్నారు. 2029 ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!