

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన T సిరీస్‌లో ఐదో మోడల్‌గా Vivo T5 5Gని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K 3D కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్‌రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై పనిచేసే ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్, మీడియాటెక్ NPU 850 ఏఐ ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నాయి. ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో పాటు మూడేళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్స్, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను సంస్థ అందిస్తోంది.
కెమెరా విభాగంలో 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 7,050mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కల్పించారు. ఫోన్ బరువు 199 గ్రాములు. 6GB+128GB వేరియంట్ ధర రూ.34,999, 8GB+128GB ధర రూ.39,999, 8GB+256GB ధర రూ.44,999, 12GB+256GB ధర రూ.49,999గా నిర్ణయించారు. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో రూ.4,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానుండగా, రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!