2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

Writer: Pooja 03:41 PM, 2 సెప్టెంబర్, 2026
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, కృష్ణ జన్మాష్టమి పేర్లతో పిలిచే ఈ పర్వదినం వచ్చేసింది. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ నెల 4న జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆలయాలతో పాటు ఇళ్లలోనూ ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. చిన్నికృష్ణుడి చిలిపి చేష్టలు, ఉట్టి ఉత్సవాలతో పాటు ఉత్తర భారతదేశంలో 56 రకాల వంటకాలతో సమర్పించే ‘ఛప్పన్ భోగ్’ మహా నైవేద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

పురాణాల ప్రకారం, ఇంద్రుడి ఆగ్రహంతో బ్రజభూమిలో భారీ వర్షాలు కురిసినప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి గొడుగులా పట్టుకుని బ్రజవాసులను ఏడు పగళ్లు, ఏడు రాత్రులు కాపాడాడు. ఆ సమయంలో కృష్ణుడు రోజుకు ఎనిమిది సార్లు భోజనం చేసే వాడని, ఏడు రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడంతో 56 భోజన వేళలు కోల్పోయాడని బ్రజవాసులు భావించారట. వర్షాలు తగ్గిన అనంతరం ప్రేమతో 56 రకాల వంటకాలను తయారు చేసి కృష్ణుడికి సమర్పించారని, అప్పటి నుంచి ‘ఛప్పన్ భోగ్’ సంప్రదాయం కొనసాగుతోందని విశ్వాసం.

ఛప్పన్ భోగ్‌లో ప్రాంతీయ, ఆలయ సంప్రదాయాలను బట్టి వంటకాలు మారుతుంటాయి. లడ్డూలు, పేడాలు, జిలేబీ, రబడీ, వెన్న-మిశ్రీ, పాయసాలు, పూరీలు, కచోరీలు, అన్నం, పప్పు, కూరగాయల వంటకాలతో పాటు పండ్లు, డ్రై ఫ్రూట్స్, చట్నీలు, ఊరగాయలు వంటి వాటిని సమర్పిస్తారు. అయితే 56 రకాల వంటకాలు సిద్ధం చేయడం సాధ్యం కాకపోయినా భక్తితో సమర్పించే ఏ నైవేద్యమైనా ముఖ్యమేనని భక్తులు విశ్వసిస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ‘పత్రం పుష్పం ఫలం తోయం’ భావం ప్రకారం, స్వచ్ఛమైన మనసుతో సమర్పించే తులసి దళం, పండు లేదా నీరు కూడా ఆయనకు ప్రీతికరమేనని నమ్మకం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

ట్యాగ్లు
కృష్ణాష్టమిశ్రీకృష్ణుడుఛప్పన్ భోగ్జన్మాష్టమిగోవర్ధన గిరికృష్ణ జన్మాష్టమి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తుమ్మలతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ భేటీ
జనరల్

తుమ్మలతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ భేటీ

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు
జనరల్

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..
టెక్నాలజీ

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..
జనరల్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు
జనరల్

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...
జనరల్

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్
జనరల్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!