

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం భాగస్వామ్యం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మొదట్లో కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యంగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర–ప్రైవేట్ (ఎల్ & టీ) భాగస్వామ్యంగా మారిపోయింది. అయితే, భారీ విస్తరణకు కేంద్ర భాగస్వామ్యం తప్పనిసరిగా అవసరమని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఇటీవల నగరంలో జరిగిన కన్క్లేవ్కు వచ్చిన కేంద్ర గృహనిర్మాణ, పట్టణవికాస శాఖా మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను రేవంత్ ప్రత్యక్షంగా కలిసి మెట్రో ప్రాజెక్టులో కేంద్రం భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత పనులు, రాబోయే కారిడార్లు, కేంద్ర అనుమతుల కోసం ఎదురుచూస్తున్న ప్రతిపాదనలను వివరించి, ఫేజ్-2 ఆమోదాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశం తర్వాత ఖట్టర్ ఒక కీలక అప్డేట్ను వెల్లడించారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం మరియు ఎల్ & టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ మెట్రో, త్వరలో కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వాల మధ్య 50:50 జాయింట్ వెంచర్‌గా మారనుంది. అలాగే సుమారు 162 కి.మీ. కొత్త మెట్రో మార్గాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. మార్చిలో అమలు చేయగలిగే కారిడార్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో హైదరాబాద్‌లో తదుపరి వేగవంతమైన వృద్ధి దిశగా మెట్రో విస్తరణకు కొత్త దశ ప్రారంభం కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!