
జనరల్

ఆల్కహాల్ శాతం అధికంగా ఉన్న కొన్ని ఔషధాల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై 12 శాతానికి పైగా ఇథైల్ ఆల్కహాల్ కలిగిన మందులను వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే విక్రయించాలని మెడికల్ షాపులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ తరహా మందులను విక్రయించరాదని స్పష్టం చేసింది.
కొన్ని రకాల దగ్గు సిరపులు, టానిక్‌లు మరియు ఇతర ఔషధాల్లో స్థిరత్వం, నాణ్యత కోసం ఇథైల్ ఆల్కహాల్‌ను ఉపయోగిస్తారు. అయితే, చికిత్స కోసం కాకుండా మత్తు కోసం ఈ మందులను దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త నిబంధనలతో మందుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రజారోగ్యాన్ని మరింత రక్షించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!