

హైదరాబాద్‌లోని చర్లపల్లి ప్రాంతానికి చెందిన పబ్బా చంద్రశేఖర్, ఆయన భార్య స్వప్న స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన అనంతరం అదృశ్యమవడం కలకలం రేపుతోంది. జూన్ 22న హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్‌కు బయల్దేరిన ఈ దంపతులతో అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో ఆందోళన చెందిన కుమార్తె చర్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. వారం క్రితం పబ్బా చంద్రశేఖర్ దంపతులపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సుమారు రూ.50 కోట్లు వసూలు చేసి మోసం చేశారని వారు ఆరోపించారు. డబ్బులు సేకరించిన అనంతరం దంపతులు స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు, అదృశ్యమైన ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!