

బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. యాసంగి రైతుబంధు పూర్తిస్థాయిలో చెల్లించలేదని, ఇప్పుడు వానాకాలం రైతుబంధు పేరుతో మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.29,300 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని హరీష్‌రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. పంటలకు ప్రకటించిన బోనస్ అమలులోకి రాకపోవడంతో అది బోగస్ హామీగా మారిందన్నారు. యూరియా అందుబాటులో ఉంటే యాప్ అవసరం ఉండదని, సరఫరా లోపాలను దాచేందుకే యాప్ పేరుతో కథలు చెబుతున్నారని విమర్శించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!