

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఎప్స్టీన్ ఆరోపణలను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ పీస్ ఇనిస్టిట్యూట్ (IPI) బృందంలో భాగంగా తాను ఎప్స్టీన్ ను కలిసినట్లు తెలిపారు. ఐపీఐలో మా బాస్‌కు ఎప్స్టీన్ తెలుసు కొన్ని సందర్భాల్లో మాత్రమే సమావేశమయ్యాను. కచ్చితంగా చెప్పాలంటే మూడో నాలుగు సార్లు మాత్రమే కలిశాను. ఒక్కసారి మాత్రమే ఈమెయిల్ ద్వారా సంభాషణ జరిగింది. అతడి పై వచ్చిన ఆరోపణలకు మా మధ్య జరిగిన పరిచయానికి ఎలాంటి సంబంధం లేదు అని వెల్లడించారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అసత్య ప్రచారంగా అభివర్ణిస్తూ, రాజకీయ లాభం కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు.
బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఎప్టోన్ ఫైల్స్ అంశాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భంలో అదానీ, అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పూరీ పేర్లను ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!