

మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో రాజకీయ సవాలు ఎదురవుతోంది. కాంగ్రెస్‌లో మెజారిటీ సాధించిన డెమొక్రాట్లు ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అవినీతి, అక్రమాలకు పాల్పడి భారీగా ఆర్థిక లబ్ధి పొందారన్న ఆరోపణలపై సమగ్ర విచారణలు చేపట్టాలని వారు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వారి ఆర్థిక లావాదేవీలు, ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ సంస్థలు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్, క్రిప్టో వ్యాపారాలు, జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ విచారణల ద్వారా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ కమిటీలు, సబ్‌పీనా అధికారాలను ఉపయోగించుకోవాలని డెమొక్రాట్లు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తనపై అభిశంసనకు ప్రయత్నిస్తే డెమొక్రాటిక్ పార్టీ నాశనమవుతుందని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో అమెరికా రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!