
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలించేందుకు డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. చట్టబద్ధంగా, వ్యవస్థాబద్ధంగా ఎన్నికలను నిర్వహించేందుకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్కు బీసీ రిజర్వేషన్ల అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని బాధ్యతలు అప్పగించారు. కమిషన్ 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ రూపకల్పనలో ఈ నివేదిక కీలకంగా మారనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!