

ఆంధ్రప్రదేశ్‌కు కూటమి ప్రభుత్వం భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ ప్రాజెక్టులను తీసుకొస్తుంటే.. వాటిని అడ్డుకునేందుకు వైకాపా నేతలు పిటిషన్లు వేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వివిధ రంగాలకు వస్తున్న పెట్టుబడులు, యువతకు కల్పిస్తున్న ఉద్యోగాలపై బహిరంగ చర్చకు రావాలని వైకాపా అధినేత జగన్‌కు సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని వివరించారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని, ఇప్పటికే వేలాది ఉద్యోగాలు కల్పించామని లోకేశ్ పేర్కొన్నారు. ఇదే తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. అయితే, ఈ విజయాల ఘనతను సొంతం చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో తమ ప్రభుత్వానికి స్పష్టమైన ట్రాక్ రికార్డు ఉందని, జగన్ ట్రాక్ రికార్డు మాత్రం ఖాళీ మ్యాప్ మాత్రమేనంటూ లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!