23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో

Writer: Shivani K 05:40 AM, 23 నవంబర్, 2026
ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో

సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం తర్వాత బెపికొలంబో వ్యోమనౌక బుధ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. సుమారు ఎనిమిదేళ్లపాటు సాగిన ఈ ప్రయాణం ద్వారా సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న బుధ గ్రహానికి సంబంధించిన అనేక రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. బెపికొలంబో అనేది రెండు రోబోటిక్‌ వ్యోమనౌకలతో కూడిన అంతరిక్ష ప్రాజెక్టు. వీటిలో ఒకదాన్ని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, మరొకదాన్ని జపాన్‌ అంతరిక్ష సంస్థ రూపొందించాయి. వచ్చే నెలలో ఈ రెండు వ్యోమనౌకలు విడిపోయి, బుధుడి ఉపరితలానికి వేర్వేరు ఎత్తుల్లో పరిభ్రమిస్తూ పరిశోధనలు చేపట్టనున్నాయి. సుమారు 200 కోట్ల డాలర్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. బుధుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించేందుకు శనివారం వ్యోమనౌకలోని రాకెట్‌ ఇంజిన్లను మండించారు. అనంతరం జర్మనీలోని ఫ్లైట్‌ కంట్రోల్‌ కేంద్రం కొన్ని గంటల తర్వాత కక్ష్య ప్రవేశాన్ని ధ్రువీకరించడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.

2018లో ప్రయోగించిన బెపికొలంబో.. నేరుగా బుధుడి వద్దకు చేరకుండా భూమి, శుక్రుడు, బుధుడి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ సుదీర్ఘ మార్గంలో ప్రయాణించింది. ఈ క్రమంలో వెయ్యి కోట్ల కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించింది. బుధుడి అంతర్గత, బాహ్య అయస్కాంత క్షేత్రాలు, పర్వత శ్రేణులు, ఉల్కాపాతాల వల్ల ఏర్పడిన బిలాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలతో ఏర్పడిన మైదానాలపై అధ్యయనం చేయనుంది. ఈ గ్రహంపై ఉష్ణోగ్రతలు 427 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదవుతుండటంతో వ్యోమనౌకలోని ఎలక్ట్రానిక్‌, ఇంజినీరింగ్‌ వ్యవస్థలకు సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ పరిస్థితులను తట్టుకుని కనీసం ఏడాది పాటు పరిశోధనలు కొనసాగిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో నాసాకు చెందిన మెరైనర్‌-10, మెసెంజర్‌ వ్యోమనౌకలు బుధుడిని పరిశోధించాయి. ఇప్పుడు బెపికొలంబో చేపట్టనున్న పరిశోధనలు ఆ గ్రహంపై మరిన్ని కీలక వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌

జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి.. కాంగ్రెస్‌ కీలక డిమాండ్‌

సమానత్వం, మానవత్వమే గురునానక్ సందేశం.. జయంతి వేడుకల ప్రత్యేకతలు!

కార్తిక మాసంలో తప్పక దర్శించాల్సిన పంచారామ క్షేత్రం.. క్షీరారామం విశేషాలు ఇవే!

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

భారత్‌కు చేరుకున్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షా..

ట్యాగ్లు
బెపికొలంబోబుధ గ్రహంఅంతరిక్ష పరిశోధనలుఇస్రోయూరోపియన్ స్పేస్ ఏజెన్సీజపాన్ అంతరిక్ష సంస్థనాసాగ్రహాల అధ్యయనంఅంతరిక్ష విజ్ఞానంసైన్స్ అండ్ టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగాలీ జానపద కథలతో హారర్‌ థ్రిల్లర్‌.. అనీత్‌ కొత్త సినిమా విశేషాలు
సినిమాలు

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు
రాజకీయాలు

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం
జనరల్

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో
జనరల్

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో

భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌
జనరల్

భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి.. కాంగ్రెస్‌ కీలక డిమాండ్‌
జనరల్

జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి.. కాంగ్రెస్‌ కీలక డిమాండ్‌

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన
రాజకీయాలు

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

సమానత్వం, మానవత్వమే గురునానక్ సందేశం.. జయంతి వేడుకల ప్రత్యేకతలు!
జనరల్

సమానత్వం, మానవత్వమే గురునానక్ సందేశం.. జయంతి వేడుకల ప్రత్యేకతలు!

కార్తిక మాసంలో తప్పక దర్శించాల్సిన పంచారామ క్షేత్రం.. క్షీరారామం విశేషాలు ఇవే!
జనరల్

కార్తిక మాసంలో తప్పక దర్శించాల్సిన పంచారామ క్షేత్రం.. క్షీరారామం విశేషాలు ఇవే!

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 77: ఇంటి నుంచి నీతూ ఎలిమినేట్.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆరుగురు
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!