

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఉత్కంఠగా మారాయి. టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో విజయ్ సీఎం అవుతాడా లేదా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విజయ్‌కు భారీగా మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా జెన్ జీ యువత విజయ్‌కు అండగా నిలుస్తూ పోస్టులు చేస్తున్నారు. జల్లికట్టు తరహాలో ఉద్యమం చేస్తామని, అవసరమైతే మెరీనా బీచ్‌లో నిరసనలు చేపడతామని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విజయ్ సీఎం కాకుండా అడ్డుకుంటే రాజకీయంగా తగిన సమాధానం చెబుతామని హెచ్చరికలు ఇస్తున్నారు. ఈ పోస్టులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. మెరీనా బీచ్ సహా చెన్నై తీరప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి గుంపులు చేరకుండా నిఘా పెంచి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!