

హైదరాబాద్ శివారు గండిపేటలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల కబ్జా కేసులో నకిలీ జీవోలు సృష్టించిన వ్యవహారంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ పరారీలో ఉన్నారు. సైబరాబాద్ పోలీసులు నరసరావుపేటలోని ఆయన నివాసంలో సోదాలు చేయగా ఆయన అక్కడ లభించలేదు. బొల్లా రమేశ్, కొవ్వూరు సునీల్ సహా మరో ఇద్దరు నిందితులు కూడా పరారీలో ఉన్నట్లు గుర్తించారు.
నిందితులు హైదరాబాద్, కేరళ, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించినా ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. ఈ నకిలీ జీవోల వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్పై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. కబ్జా చేసిన భూమిని విక్రయించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. మరోవైపు నకిలీ జీవోలు సోషల్ మీడియాలో తొలుత ఎవరు పోస్ట్ చేశారనే అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మరో వైకాపా నేత పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!