
సినిమాలు

అసెంబ్లీ మీడియా పాయింట్లో వివేకానంద గౌడ్ మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాలు అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు సరైన భరోసా ఇవ్వడంలో విఫలమయ్యాయని, సరిపడా నిల్వలు ముందుగానే ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని విమర్శించారు.
గతంలో యూరియా కొరతతో రైతులు పడిన ఇబ్బందులను గుర్తు చేస్తూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. యుద్ధం జరుగుతున్న దేశాల్లో కూడా సరఫరాలు సక్రమంగా ఉంటే, యుద్ధం లేని దేశాల్లో ఇబ్బందులు రావడం ప్రణాళిక లోపాన్ని సూచిస్తుందని అన్నారు. పరస్పరం నెపం మోపకుండా సమస్య పరిష్కారానికి రెండు ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకోవాలని కోరారు.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!