
జనరల్

కృష్ణానదిలో మత్స్యకారులు భారీ బోట్ల ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది నిధులు విడుదల చేయడంపై గంగపుత్రులు హర్షం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మత్స్యకారులు బోట్ల ప్రదర్శన నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ చర్యలను అభినందించారు.
వేట నిషేధ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక భరోసా అందిస్తోంది. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం అందించగా, ఈ ఏడాది 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!