
న్యూస్

పెట్రోలు, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకం తగ్గించిన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతించారు. ఈ నిర్ణయం సంక్షోభ సమయంలో ప్రజలకు కొంత ఊరటనిస్తుందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం ఇదేనని అన్నారు.
అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని ఆయన కోరారు. అలా చేస్తే ఇంధన ధరలు ఇంకా తగ్గి ప్రజలకు మరింత ఉపశమనం లభిస్తుందని తెలిపారు. చమురు ధరలు తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని చెప్పారు. ప్రజల మేలు కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

.jpeg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!