

విలక్షణ కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ‘ఎస్‌ఎస్‌ఎస్1’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను రేపు ఉదయం 9:45 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం.
పూజా కార్యక్రమాలు పూర్తైన కొద్ది రోజులకే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కార్యక్రమంలో చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. దీంతో శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!