

ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావొద్దని తమిళనాడు సీఎం విజయ్ తమ పార్టీ(టీవీకే) ఎమ్మెల్యేలకు హితవు పలికారు. రోజుకో వివాదంతో అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఇరకాటంలో పెడుతున్న ఎమ్మెల్యేలతో విజయ్ బుధవారం మహాబలిపురం సమీపంలోని ఓ రిసార్టులో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలకు పట్టువస్త్రాలు, బహుమతులు అందించి.. తర్వాత క్లాస్ తీసుకున్నారు. ప్రజా సేవపైనే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేలు తనను ఎప్పుడైనా కలుసుకోవచ్చన్నారు.
మహిళా కలెక్టర్కు అశ్లీల సందేశాలు పంపిన కళ్లకురిచ్చి ఎమ్మెల్యే అరుళ్ విఘ్నే్షపై విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరో రెండు రోజుల పాటు రిసార్టులోనే ఉండాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఇదిలా ఉండగా, తమిళనాట కొనసాగుతున్న హత్యలపై కేంద్రప్రభుత్వం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను నివేదిక కోరినట్లు తెలిసింది. ఈ నెల 8వ తేదీన ఒకే రోజు తమిళనాట 13 హత్యలు జరిగాయి. మృతుల్లో ఓ ఎస్సై కూడా ఉండటం గమనార్హం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!