

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఎంపీ పట్టుబడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరించడం అంగీకారయోగ్యం కాదని, అతడిపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ కూడా అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని షర్మిల కోరారు.
సోషల్ మీడియాలో స్పందించిన షర్మిల, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం తీవ్ర బాధ్యతారాహిత్యమని విమర్శించారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ప్రజాప్రతినిధి సమాజానికి ఏ సందేశం ఇస్తారని, యువతను తప్పుదోవ పట్టించే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె అన్నారు. నిజంగా డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటే ముందుగా తమ పార్టీ ఎంపీపై చర్యలు తీసుకుని ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని షర్మిల సవాల్ విసిరారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!