
సినిమాలు

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ఇటీవలి కాలంలోనే అతిపెద్ద చీలిక చోటుచేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ శాసనసభాపక్షంలో తిరుగుబాటు వర్గం ఆధిపత్యం సాధించిందని ప్రకటించడంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం, మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది తమకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొంది. ఈ మేరకు మద్దతు లేఖలను అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించినట్లు తెలిపింది. అవసరమైన సంఖ్యాబలం తమకు ఉండటంతో అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ఆ వర్గం భావిస్తోంది. అదే సమయంలో మమతా బెనర్జీయే తమ అధినేత అని, ఆమె పార్టీకి ప్రధాన సలహాదారుగా కొనసాగాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!