
జనరల్

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్‌లో విజయవంతంగా మోకాలి శస్త్రచికిత్స పూర్తయిందని వైద్యులు తెలిపారు. ఏఐజీ ఆసుపత్రిలో సుమారు మూడు గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన గాయపడిన విషయం తెలిసిందే.
మోకాలి చుట్టూ వాపు, రక్తం గడ్డకట్టడం గమనించిన వైద్యులు పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో మోకాలి కండరాల్లో చీలిక ఉన్నట్లు తేలడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!