
షోస్

తెలంగాణ శాసనసభలో శుక్రవారం పలు కీలక బిల్లులు, అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోర్ అర్బన్ రీజియన్ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరనున్నారు. అలాగే మున్సిపాలిటీలకు సంబంధించిన బిల్లును ఆమోదించాలని సభలో ప్రతిపాదించనున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ ప్రజా విశ్వాసం బిల్లును ప్రవేశపెట్టేందుకు సభ అనుమతి కోరనున్నారు.
ఇక కీలక అంశాలపై సభలో స్వల్పకాలిక చర్చలు కూడా జరగనున్నాయి. 2027 జనగణన రెండో విడత ప్రశ్నావళిలో బీసీ, ఓబీసీ వర్గాలను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అంశంపై చర్చ జరగనుంది. అలాగే తెలంగాణలో విద్యారంగంలో చేపట్టిన మార్పులు, సంస్కరణలపై మరో స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!