
రాజకీయాలు

ముస్లిం పెద్దలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చేసిన డిమాండ్‌పై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని అనుసరించేవారికి ఆవు కేవలం జంతువు కాదని, అది తల్లితో సమానమని ఆయన పేర్కొన్నారు. ఆవుతో హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధం ఎంతో బలమైనదని తెలిపారు.
ఆవుతో తమ బంధం జన్మజన్మల సంబంధమని, గంగా మాతను ఎలా పూజిస్తామో అలాగే గోమాతను గౌరవిస్తామని యోగి అన్నారు. ఆవును రాష్ట్ర మాతగా భావిస్తామని, దీనికి అధికారిక ప్రకటన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!