
గాసిప్స్

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
సమావేశంలో ఉపాధి హామీ పథకం పేరు మార్పు అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పార్టీ వైఖరిని స్పష్టంచేయడంతో పాటు, దీనిపై దేశవ్యాప్త ఆందోళన చేపట్టే అంశంపై కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
CWC సమావేశానికి ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!