

భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులకు కీలక విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజా పాలనపై బీఆర్‌ఎస్ చేపట్టిన వారం రోజుల కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రేణులు ధీటుగా స్పందించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ వెయ్యి రోజులుగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ అసెంబ్లీ చర్చల్లో ఒక్కరోజు కూడా పాల్గొనలేదని విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను కూడా సరిగా వినియోగించడం లేదని ఆరోపించారు.
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యారని చామల విమర్శించారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌లోని దళిత ఎమ్మెల్యేకు ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై మాట్లాడే నైతిక అర్హత ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా పాలన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!