
జనరల్

హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ విభిన్న కథలను ఎంచుకుంటున్న కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘హతః’ అనే టైటిల్‌తో సైకలాజికల్ మిస్టరీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కిరణ్ అబ్బవరం సమర్పణలో రానున్న ఈ సినిమాకు అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయగా, ఇది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేస్తూ మేకర్స్ ‘ఈ పిల్లి బతికి ఉందా.. లేక చనిపోయిందా?’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించారు. ఈ ఒక్క ప్రశ్నతోనే సినిమాలోని మిస్టరీపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. వినూత్నమైన కథాంశంతో సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!