

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి మంగళవారం ఒక లేఖ రాశారు. ఈ లేఖలో వరంగల్ కోటకు సంబంధించిన భూముల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. వరంగల్ కోట భూములను భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అధీనంలోని భూములుగా అధికారికంగా గుర్తించాలని సీఎం సూచించారు. అలాగే, కోట పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, భూములను ఆక్రమించిన వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరారు.
దాదాపు 250 సంవత్సరాల పాటు కాకతీయుల రాజధానిగా వెలుగొందిన ఓరుగల్లు (వరంగల్) పట్టణం ఘనమైన చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వైభవంతో తెలంగాణ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని సీఎం లేఖలో పేర్కొన్నారు. మూడు ప్రాకారాలతో పాటు కోటకు సంబంధించిన ఇతర ప్రాంతాలను కొందరు స్థానికులు ఆక్రమించి, అక్కడ అనేక అక్రమ కట్టడాలు నిర్మించినట్లు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
వరంగల్ కోట ఒక ఏఎస్ఐ ఆధీనంలోని రక్షిత స్మారక ప్రదేశమని, ఆ భూములను ఆక్రమించడం లేదా అక్రమ నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని కిషన్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. ఈ విషయమై ఏఎస్ఐ అధికారులు పలుమార్లు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినప్పటికీ, పరిస్థితిలో మార్పు రాలేదని ఆయన తెలిపారు.
చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, వరంగల్ కోట భూములను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!