

మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్ పై ఈ నెల 13 న పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ వివరాలను కూడా ప్రజల ముందు ఉంచుతానని చెప్పారు. మూసీ ప్రక్షాళన అంశంపై ప్రతిపక్షాలు తమ వైఖరి స్పష్టం చేయాలని సీఎం సూచించారు. ఒకవైపు దోమలను నియంత్రించాలంటూ మాట్లాడుతూనే, మరోవైపు మూసీ శుద్ధి పనులకు వ్యతిరేకంగా నిలవడం సరైన విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
నదుల బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించాల్సి వస్తుందని చెప్పారు. అలాంటి ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు భవిష్యత్తులో విలువ ఉండదని కూడా తెలిపారు.
ఈ అంశంపై రాజకీయాలు చేయడం మానుకుని, ప్రాజెక్ట్ కారణంగా నష్టపోయే వారికి ఎలాంటి పరిహారం ఇవ్వాలనే విషయంపై చర్చ జరగాలని సీఎం సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!