
సినిమాలు

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులు చేశారు. భూ సంబంధిత సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల పరిష్కారానికి సైన్యం సహకారం అందించాలని సీఎం కోరారు. రాష్ట్ర అభివృద్ధి, భద్రతకు సంబంధించిన అంశాల్లో సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అలాగే దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో 2 నుంచి 4 సైనిక్ స్కూళ్ల ఏర్పాటు చేయాలన్న కేంద్ర ఆలోచనను ప్రస్తావించిన సీఎం, తెలంగాణలో తక్షణమే కనీసం ఒక్క సైనిక్ స్కూల్ అయినా ఏర్పాటు చేయాలని కోరారు. యువతలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడంలో సైనిక్ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!