
సినిమాలు

రేవంత్ రెడ్డి నేడు, రేపు కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మొదటి రోజు ఆయన తిరువనంతపురంలో ప్రచారం ప్రారంభించి, తర్వాత అలప్పుజ, ఎర్నాకుళం ప్రాంతాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9:30 గంటలకు ఎస్‌ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు రోడ్ షో చేస్తారు. తర్వాత ఉదయం 11 గంటలకు భారతన్నూర్‌లో జరిగే కార్నర్ మీటింగ్‌కు హాజరవుతారు.
మధ్యాహ్నం 12 గంటలకు కట్టక్కడ నుంచి పూవాచల్, వెల్లనాడ్ వరకు మరో రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అలప్పుజలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొని, ఆ తర్వాత ఎర్నాకుళం వెళ్లనున్నారు. ఈ ప్రచారం ద్వారా ఓటర్లను కలుసుకుని పార్టీకి మద్దతు పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!