

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గకుండా చూడాలని వారికి సూచించారు. ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలు, ఘర్షణలు చోటుచేసుకున్నా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. కార్యకర్తలు ఎక్కడా సంయమనం కోల్పోకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!