

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తొలిసారిగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జానీ దుష్మన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ ఒరిజినల్ హారర్ ఫ్రాంచైజ్‌గా రూపొందుతోంది. టీ-సిరీస్ ఫిల్మ్స్ అధినేత భూషణ్ కుమార్, ఆల్మైటీ మోషన్ పిక్చర్‌కు చెందిన ప్రభ్‌లీన్ సంధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన భూమి పెడ్నేకర్, “భయం చాలా చూసి ఉంటారు.. కానీ ఇప్పుడు ఒళ్లు గగుర్పొడిచే భీభత్సాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించారు. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
పూర్తిగా యునైటెడ్ కింగ్‌డమ్ నేపథ్యంలో సాగే ఈ కథలో తల్లి-కూతుళ్ల మధ్య బలమైన అనుబంధం, కుటుంబంలో దాగి ఉన్న రహస్యాలు, ఒక ఆత్మ సృష్టించే భయానక పరిస్థితులు ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సూపర్‌హిట్ పారానార్మల్ సిరీస్ భయ్ – ది గౌరవ్ తివారీ మిస్టరీ వెనుక పనిచేసిన క్రియేటివ్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి కలుస్తోంది. అర్షద్ సయ్యద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హారర్‌తో పాటు యాక్షన్ అంశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ బ్రిటిష్ స్టంట్ కోఆర్డినేటర్ పీటర్ పెడ్రెరో ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!