
జనరల్

“మత్స్యకారుల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట సముద్ర తీర గ్రామాన్ని సందర్శించారు. మత్స్యకారుడు తానంగారి బాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
తుపాను కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఇళ్ల నిర్మాణం కోసం మాజీ సీఎం ఎన్టీఆర్ వేసిన శిలాఫలకాన్ని ఆయన పరిశీలించారు. చేపలు విక్రయిస్తున్న మహిళలతో మాట్లాడి వారి వ్యాపార పరిస్థితులు తెలుసుకున్నారు మరియు అక్కడే చేపలు కూడా కొనుగోలు చేశారు. మత్స్యకారుల సమస్యలు, బోట్లు, వలలు వంటి మౌలిక సదుపాయాలపై చర్చ జరిగింది. 200 మెకనైజ్డ్ బోట్లపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అనంతరం మత్స్యకార కుటుంబంతో కలిసి భోజనం చేసి, వారితో స్నేహపూర్వకంగా గడిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!