

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. హైటెక్ సిటీకి కంపెనీలను తానే తీసుకొచ్చానని కేటీఆర్ చెబుతున్నారని, కానీ విదేశీ పెట్టుబడులు దేశ ఆర్థిక విధానాలు మరియు కేంద్ర ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం కారణంగానే వస్తాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణపై సుమారు రూ.6 లక్షల కోట్ల అప్పు మోపిందని, ప్రస్తుతం ఆ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక భారం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన విమర్శించారు. అయినప్పటికీ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం తన సహకారాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!