
జనరల్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్ నేడు గాంధీ భవన్‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ ప్రజాప్రతినిధులకు ఆయన అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయి వారితో మాట్లాడనున్నారు.
సమావేశాలు ముగిసిన అనంతరం బీఎం సందీప్ కుమార్ తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు. వచ్చే నెల 4వ తేదీన మళ్లీ హైదరాబాద్‌కు రానున్నారు. గత పర్యటన సమయంలో మంత్రి సీతక్క అందుబాటులో లేకపోవడంతో ఆయనను కలవలేకపోయారు. ఈ నేపథ్యంలో నేడు ఆమె మర్యాదపూర్వకంగా పార్టీ ఇన్‌చార్జిని కలవనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!