

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రైవేటు సర్వే నంబర్లతో కలిసిపోయాయని పేరుతో లక్షన్నర ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరైంది కాదని ఆ పార్టీ విమర్శించింది. క్రమబద్ధీకరణ పేరుతో ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది.
ఈ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, అవి ఆలయాలకు చెందినవిగా తేలితే తిరిగి ఆలయాలకే అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీజేపీ స్పష్టం చేసింది. అలాగే పట్టణ ప్రాంతాల్లోని విలువైన భూములను దీర్ఘకాలిక లీజులకు ఇవ్వడాన్ని కూడా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆలయాల భూములను దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం తప్పని పేర్కొంది.
ఈ విధానాలు హిందూ ఆలయాల రక్షణకు ముప్పుగా మారుతున్నాయని, హిందూ సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని బీజేపీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల వల్ల హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టేలు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాలను నిలిపివేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!