
.webp&w=3840&q=75)
బీహార్ ఎన్నికల ప్రభావం తెలంగాణ రైతులపై తీవ్రంగా పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బియ్యం కొనుగోలు కేంద్రాలు హమాలీల కొరతతో నిలిచిపోయాయి. మిల్లుల వద్ద లోడింగ్, అన్లోడింగ్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది హమాలీలు పనిచేస్తుండగా, వారిలో 18 వేల మంది బీహార్ రాష్ట్రానికి చెందినవారే.
ఓటు హక్కును వినియోగించుకునేందుకు, అలాగే రాజకీయ పార్టీలు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఇచ్చి వారిని స్వస్థలాలకు పంపించడంతో కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో రైతులు ధాన్యం అమ్మకాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా ఆలస్యమైన కొనుగోళ్లు ఇప్పుడు ఎన్నికల కారణంగా పూర్తిగా నిలిచిపోయాయి.
ఈ రోజు (నవంబర్ 11) బీహార్లో ఎన్నికలు ముగుస్తున్నాయి. హమాలీలు తిరిగి వచ్చిన తర్వాతే కొనుగోలు కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!