
ఓటీటీ

బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా అనంతరం ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు ఈ గురువారం ముహూర్తం ఖరారైంది. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కావడంతో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే ఆసక్తి నెలకొంది.
సమాచారం ప్రకారం బీజేపీకి 12 మంత్రి పదవులు, జేడీయూకు 11, ఎల్‌జేపీకి 2, హెచ్‌ఏఎం మరియు ఆర్‌ఎల్‌ఎం పార్టీలకు ఒక్కో పదవి దక్కే అవకాశం ఉంది. మిగిలిన ఆరు పదవులను తరువాత భర్తీ చేయనున్నారు. మంత్రివర్గంపై తుది చర్చలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిపిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!