
జనరల్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మంత్రి నారా లోకేష్ కలిసి శంకుస్థాపన చేశారు. AMCAతో పాటు డిఫెన్స్, డ్రోన్ సిటీకి సంబంధించిన మరికొన్ని కీలక ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో రక్షణ రంగ అభివృద్ధికి కీలక అడుగుగా భావిస్తున్నారు.
అనంతరం వేదిక వద్ద ఏర్పాటు చేసిన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను నేతలు పరిశీలించారు. మిస్సైళ్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, ఆధునిక తుపాకులు, యుద్ధ విమాన ప్రోటోటైప్స్ వంటి ఆధునిక డిఫెన్స్ టెక్నాలజీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పలువురు మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!